నగ్నచిత్రాలంటూ బెదరింపులు
టిడిపి మాజీ ఎంపి నామా, అతని సోదురులపై కేసు
హైదరాబాద్,అక్టోబర్28(జనంసాక్షి): నగ్న చిత్రాలున్నాయ్.. బయటపెడతా.. అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావుపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌కు చెందిన మహిళను బెదిరించినట్లు నామాపై ఆరోపణలు ఉన్నాయి. నగ్న చిత్రాలున్నాయ్.. బయట పెడతానంటూ.. తనను మాజీ ఎంపీ నామా బెదిరిస్తున్నాడని బాధిత మహిళ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నామా నాగేశ్వర్‌రావు, ఆయన సోదరుడు సీతయ్యపై కేసు నమోదైంది. ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రకంగా కోర్టు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీకి చెందిన ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావుపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో నామా నాగేశ్వరరావుతోపాటు ఆయన తమ్ముడు నామా సీతయ్యపై ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నగ్న చిత్రాలు ఉన్నాయి.. బయటపెడతానంటూ తనను బెదిరిస్తున్నారని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. కాగా… గత మూడు నెలల క్రితమే ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదులో పోలీసులు తాత్సారం చేశారనే ఆరోపణలొస్తున్నాయి. దీంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. వెంటనే నామా నాగేశ్వరరావు, నామా సీతయ్యలపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నామా తనను బెదిరిస్తున్నాడని, దుర్భాషలాడుతున్నాడని జూబ్లీహిల్స్‌కు చెందిన సుజాత రామకృష్ణన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 23న నామా నాగేశ్వరరావు ఆయన సోదరునితో కలిసి తన ఇంటికి వచ్చి దుర్భాషలాడుతూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఖమ్మంలో తన కుమారుడు చదువుతోన్న కళాశాలకు ఓ అజ్ఞాత వ్యక్తిని పంపించి నామా సోదరుడు బెదిరించారని, ఈ విషయమై జులై 30వ తేదీనే పోలీసులకు ఫిర్యాదు చెసినట్లు తెలిపారు. నామా, ఆయన సోదరుని నుంచి తనకు ప్రాణ హానీ ఉందని.. బెదిరింపులకు సంబంధించి వీడియో, ఆడియో టేపులను వాట్సాప్ ద్వారా పంపినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.



