” నరేంద్రమోడీ భారత ప్రధానిగా భారతావని విశ్వగురు స్థానాన్ని అధిష్టించడం ఖాయం – భాజపా నేత గజ్జల యోగానంద్”
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 29( జనంసాక్షి): భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ పరిపాలన ఎంతో సుభిక్షమైనదని, సుపరిపాలన ద్వారా దేశంలోని అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ ప్రపంచ దేశాల మన్ననలను అందుకోవడం జరుగుతుందని, త్వరలోనే నరేంద్ర మోడీ భారత ప్రధానిగా విశ్వగురు స్థానాన్ని అదిష్టించడం ఖాయమని శేరిలింగంపల్లి బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్, సీనియర్ నేత గజ్జల యోగానంద్ ధీమాను వ్యక్తం చేశారు. ఈ మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం మదీనాగూడ పరిధి కినారా గ్రాండ్ హోటల్ లో బుధవారం రాత్రి నిర్వహించిన మేధావుల సదస్సుకు మధ్యప్రదేశ్ బిజెపి ఇంచార్జ్ మురళీధర్ రావు, రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధ్యక్షులు సామ రంగారెడ్డితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగానంద్ తదితరులు మాట్లాడుతూ సేవాపఖ్వాడ కార్యక్రమంలోభాగంగా మేధావుల సదస్సులో పాల్గొనడం, పలువురు మేధావులతోకలిసి సామాజిక అంశాలను చర్చించడం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. మోదీ నాయకత్వంలో ప్రపంచ పటంపై క్రియాశీలపాత్రను పోషించడంద్వారా భారతదేశం విశ్వగురు స్థానాన్ని అందుకోబోతుందని ధీమాను వ్యక్తంచేశారు. నరేంద్రమోదీ భారతప్రధానిగా పదవి చేపట్టినప్పటినుండి భారత దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని, విదేశీ నీతి, దౌత్యంవల్ల భారతదేశ ఖ్యాతి విశ్వ వ్యాప్తంగా విస్తరిస్తూ భారతదేశ గౌరవం ఎంతో ఇనుమడించిందని, ప్రపంచ దేశాలలో దేశంపట్ల గౌరవం అనేకరెట్లు పెరిగిందని అన్నారు. నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన జన్ ధన్ యోజన, ఫసల్ భీమా యోజన, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ సమ్మాన్ నిధి యోజన, జీవన్ జ్యోతి భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ముద్ర యోజన మొదలైన పథకాల వల్ల పేద ప్రజలకు చాలా ప్రయోజనం చేకూరిందని, నిరుపేద వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడం జరిగిందని వారు పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తన రాజనీతిని ప్రదర్శిస్తూనే మరోవైపు పనులను, పథకాలను సమగ్రంగా భారత ప్రజలకు అందేలా ప్రత్యేక చొరవ చూపిస్తున్న ఘనత మోడికే దక్కుతుందన్నారు. జాతీయస్థాయి పథకాలను తెలంగాణలోని ప్రతిఇంటికి తీసుకెళ్ళి వారికి మోదీ పరిపాలన గురించి వివరించి తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పర్చడానికి తమ మద్దతును కోరాలని ప్రతి బిజెపి కార్యకర్తకు, నాయకులకు వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ గౌడ్, కాంచన కృష్ణ, మొవ్వ సత్యనారాయణ, డా. నరేష్, నాగేశ్వర్ గౌడ్, రమేష్ సోమిశెట్టి, విజిత్ వర్మ, బొబ్బ నవతా రెడ్డి, రాఘవేందర్ రావు, హరి కృషా, శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, వివిధ రంగాల మేధావులు పాల్గొన్నారు.