నర్సాపూర్ ఎంపీపీ పై అన ర్హతవేటు ఆదేశాలు జారీ చేసిన జెడ్పి సీఈవో ఎంపీడీవో మార్టిన్ లూథర్.
నర్సాపూర్. మార్చి, 3 , (.జనం సాక్షి. ).
నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి పై హన అర్హత వేటుపడింది. జిల్లా సీఈవో వెంకట శైలేష్ కుమార్ ఇందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేశారు. శుక్రవారం నాడు నర్సాపూర్ ఎంపీడీవో మార్టిన్ లూథర్ తన కార్యాలయంలో వివరాలు వెల్లడించార. నర్సాపూర్ ఎంపీపీ హలవత్ జ్యోతి డేట్ అఫ్ బర్త్ సంబంధించి తప్పుడు ధృవీకరణ సర్టిఫికెట్లు పెట్టి హైమద్ నగర్ ఎంపీటీసీగా పోటీ చేసిందని చిప్పలుతుర్తి గ్రామానికి చెందిన డి శ్రీనివాస్, చిప్పల తూర్తీ ఎంపీటీసీ సంధ్యారాణి లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారుల బృందం ఫిబ్రవరి 25న ఇం దుకు సంబంధించిన స్కూటీని టీం ఏర్పాటు చేసి ఎంపీపీ జ్యోతి కి సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించారు. అయితే స్కూలు రికార్డులో, టిసి బోనాఫైడ్ లో 10- 8- 2001 ఉండగా, హైమద్ నగర్ ఎంపీటీసీగా పోటీ చేసే సమయంలో 10- 8- 1997 పెట్టి, కళ్యాణ లక్ష్మి సమయంలో 10 – 8- 1998 సర్టిఫికెట్ పెట్టినట్లు తెలిపారు. మూడు సర్టిఫికెట్లులో ఒకదానితో ఒకటి పొంతన లేకపోవడంతో అధికారుల బృందం ఆమెను ఎంపీపీ పదవికి అనర్హురాలుగా నిర్ధారించారు. అయితే నామినేషన్ వేసే సమయానికి 21 సంవత్సరాలు నిండి ఉండాల్సి ఉండగా 17 సంవత్సరాల 8 నెలల ఉండడంతో అధికారుల బృందం ఎంపీపీని పదవి నుంచి రద్దు చేసినట్లు ఎంపీడీవో మార్టిన్ లూథర్ తెలిపారు. ప్రస్తుతం వైస్ ఎంపీపీ గా ఉన్న నర్సింగ్ రావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.