నలుగురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

హైదరాబాద్‌ : నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. కరీంనగర్‌ సీసీఎస్‌ పీఎస్‌ నుంచి నలుగురు దొంగలు పరారైన ఘటనకు సంబంధించి ఈ చర్యలు తీసుకున్నారు.
కరీంనగర్‌, మెదక్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను ఇటీవల పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని కరీంనగర్‌లోని క్రైం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 1వ తేది సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో స్టేషన్‌ నుంచి నలుగురు దొంగలు తప్పించుకుపోయారు. టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌, క్రైం స్టేషన్‌ మూడూ పక్కపక్కనే ఉన్నప్పటికీ దొంగలు తప్పించుకుపోయారు. పోలీసు ఉన్నతాధికారులు విచారించి నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు.