నాగం భరోసా యాత్రకు ఓయూ జేఏసీ మద్దతు
హబ్సిగూడ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నగార సమితి అధ్యక్షుడు నాగం జనార్థన్‌రెడ్డి చేపడుతున్న ‘ భారోసా యాత్రకు ‘ టీఎస్‌జేఏసీ, ఓయూ జేఏసీలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ కోసం ఎవరు పోరాడినా విద్యార్థి జేఏసీ సంపూర్ణ మద్దతు ఉంటుందని టీఎస్‌జేఏసీ ఛైర్మన్ పిడమర్తి రవి, రాజారాం యాదవ్, బండారి వీరాబాబు, గాదె వెంక వేల్పుకొండ రాజేష్ ముదిరాజ్, నెమ్మది రవి, కోట, శ్రీనివాస్, వేల్పుల సంజయ్‌లు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ ఇచ్చిది మేమేనంటూ కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నదని , ఆపార్టీకి రానున్న రోజులలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.



