నాగం, మోత్కుపల్లి మధ్య వాగ్వాదం
హైదరాబాద్ : అసెంబ్లీ ప్రాంగణంలో నాగం జనార్థన్‌రెడ్డి, తెదేపా ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్శింహులు మధ్య తెలంగాణ అంశంపై వాగ్వాదం జరిగింది. తెలంగాణ ప్రజలు అణగారిపోతుంటే చంద్రబాబును మోస్తున్నారంటూ మోత్కుపల్లిని నాగం దుయ్యబట్టారు. దీనికి స్పందించిన మోత్కుపల్లి తొమ్మిదేళ్లు మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ గుర్తుకు రాలేదా అంటూ నాగంపై ఆగ్రహించారు.