నాగపూర్‌ కేంద్ర కారాగారం నుంచి ఐదుగురు ఖైదీల పరారీ

హైదరాబాద్‌ : మహారాష్ట్రలోని నాగపూర్‌ కేంద్ర కారాగారం నుంచి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. ఈ తెల్లవారుజామున రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య వీరు ఐదుగురూ పారిపోయారని పోలీసులు తెలిపారు. వారిలో ముగ్గురిని మహారాష్ట్ర కంట్రోల్‌ ఆఫ్‌ ఆర్గనైజ్‌డ్‌ క్రైమ్‌ చట్టం కింద అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి కోసం రైల్వే స్టేషన్లు, బస్టాప్‌లు, ప్రైవేటు బస్సు డిపోల్లో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.