నాగార్జున అగ్రి కెమికల్‌లో ప్రమాదం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

హైదరాబాద్‌:  శ్రీకాకుళం జిల్లా నాగార్జున అగ్రి కెమికల్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి పలువురు గాయపడటం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే ప్లాంట్‌లో చిక్కుకున్న సిబ్బందికి ఎలాంటి అపాయం జరగకుండా సహాయకచర్యలు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.