నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలి: రామయ్య

విజయవాడ: రాష్ట్ర క్యాబినెట్‌ దొంగలబండిగా మారిందని మంత్రులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ రౌడీల్లా, అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. మొగల్రాజపురంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ మంత్రి దానం నాగేందర్‌ రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రిగా ఉండటం రాష్ట్రప్రజల దౌర్భాగ్యమన్నారు. దానంపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలన్నారు.