నాటుబాంబుల దాడిలో నలుగురు మృతి

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్ష్మీపురంలో మంగళవారం ఇరువర్గాల మధ్య జరిగిన జరిగిన ఘర్షణ, నాటుబాంబుల దాడిలో నలుగురు వ్యక్తులు మరణించారు. పి.సుందర్‌రావు, ఎన్‌.వెంకట్రావు అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు రాజాం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. ఈ సంఘటనలో మరో 20 మంది తీవ్రంగా గాయపడగా, వీరంతా రాజాం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. వీరిలో కొందరి పరస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. భూవివాదాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. భూవివాదాల నేపథ్యంలో కొంతకాలంగా గ్రామంలో ఇరువర్గాల్లో కక్షలు నెలకొన్నాయి. ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ బందోబస్తుకు పోలీసు తరలి వెళ్లిన నేపథ్యంలో అదను చూసి ఇరువర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.నలుగురు మృతి, పలువురు గాయపడడానికి కారణమైన ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 25వేల పరిహారం ఇవ్వాలని అందజేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.