నాటు తుపాకీ పేలి వేటగాడు మృతి

మాచారెడ్డి జనవరి19 జనంసాక్షి; ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి వన్యప్రాణి వేటగాడు మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమరిపేట గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సోమారిపేట గ్రామపంచాయతీ పరిధిలోని సర్దాపూర్ తండాకు చెందిన రావుజీ (35) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.

రావుజీ‌తో పాటు అతని అన్న రాంరెడ్డి, ఆశిరెడ్డి అనే వ్యక్తులు కలిసి అటవీ ప్రాంతంలో గల చెరువు వద్ద వేటకు వెళ్లారు. చెరువులో దప్పిక తీర్చుకోవడానికి వచ్చే వన్యప్రాణులను వేటాడడం కోసం రావుజీ హెడ్ లైట్ ధరించి చెట్టుపైకి ఎక్కాడు. చెట్టు కింద ఉన్న రామ్ రెడ్డి నాటు తుపాకీని రావుజీకి అందించబోయాడు. మృతదేహాన్ని బయటకు తీసిన కుటుంబీకులు..
చెట్టు పైనుండి తుపాకిని వంగి తీసుకునే క్రమంలో తుపాకీ జారిపోయి కిందపడింది. ఆ తుపాకీ నేలకు తగిలి పేలడంతో వంగి ఉన్న రావుజీ శరీరంలో నుంచి గోలి బయటకు వెళ్ళింది. ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.