నానిపై టీడీపీ నేతల ఫైర్‌

హైదరాబాద్‌: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేతలు మండిపడ్డారు. నాని సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను ఏకపక్షంగా పార్టీ నుంచి గెంటేశారని నాని ఆరోపించారు. నాని వ్యాఖ్యలపై తెలుగు  తమ్ముళ్లు ధ్వజమెత్తారు. జగన్‌ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని  టీడీపీ నేత ఎర్రన్నాయుడు అన్నారు. ప్యాకేజీలకు అలవాటు పడి పార్టీపై విమర్శలు చేస్తే  కార్యకర్తలు అర్థం చేసుకోలేరా అని ఎర్రన్నాయుడు ప్రశ్నించారు. అవినీతిపై టీడీపీ పోరాటం చేయడం వల్లే విచారణలు జరుగుతున్నాయనని తెలియజేశారు. న్యాయస్థానాలే లేకపోతే అవినీతిపరులపై విచారణ జరిగేవా అని ప్రశ్నించారు.