నాన్‌ఎగ్జిక్యూటివ్ పోస్టుల అభ్యర్థుల జాబితా వెల్లడి
హైదరాబాద్: 2008 గ్రూప్-2 నాన్‌ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ వెల్లడించింది. 413 పోస్టులకు 825 మందిని ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది. ఈ నెల 20 నుంచి 27 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని పేర్కొంది. ధ్రువపత్రాల పరిశీలన పూర్తియిన వారంలో నాన్‌ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఎంపిక వివరాలు వెల్లడి చేస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది.