నిజాం పేటలో రాస్తారోకో

నిజాంపేట : తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నిజాంపేటలోని 20 కాలనీల ప్రజలు ముంబయి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన ప్రజలు రహదారిపై భైఠాయించి దీర్ఘకాలికంగా తాము ఎదుర్కోంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌చేశారు. గంటకు పైగా కోనసాగిన ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అపడానికి ప్రయత్నించారు. దీంతో స్థానికులకు మధ్య స్వల్ప తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దశలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్‌ అక్కడికి చేరుకోని అందోళనకారులు చేపడుతున్న రాస్తారోకోలో అయన కూడా భైఠాయించి సంఘీబావ తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నిజాంపేట వాసులు ఏళ్ల తరబడిగా చేస్తున్న ఈ పోరాటం న్యాయమైందని సమస్య పరిష్కారానికి జలమండలి ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్తామని హమీ ఇవ్వడంతో అందోళనకారులు శాంతించారు.