నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ గెలిచినట్లు హైకోర్టు తీర్పు

హైదరాబాద్‌: నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలిచినట్లు హైకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. గతంలో అక్కడ ఎమ్మెల్సీగా తెరాస అభ్యర్థి నర్సారెడ్డి గెలిచారు. అయితే ఆ ఎన్నిక చెల్లదని తిరిగి లెక్కింపు జరపాలని కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి హైకోర్టులో పిటీషన్‌ వేశారు. దీంతో కోర్టు ఆదేశాలమేరకు మళ్లీ లెక్కించగా వెంకట్రామిరెడ్డికి 9 ఓట్లు ఎక్కువ వచ్చాయి. దీంతో వెంకట్రామిరెడ్డి గెలిచినట్లు హైకోర్టు తీర్పు ఇచ్చింది.