నిన్న అరెస్టయిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: నిన్న అరెస్ట్‌ అయిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు నాంపల్లిలోని క్రిమినల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మంగళవారం విద్యుత్‌సౌధ ముందు టీఆర్‌ఎస్‌ చేపట్టిన కరెంట్‌ ఆందోళన సందర్భంగా వీరు ట్రాన్స్‌కో సీఎండీ కార్యాలయంలోకి దూసుకుపోయి బైఠాయించారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి దీక్ష చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ కోర్టులో హాజరుపరచగా ఇద్దరికి న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. తెలంగాణ రైతులకు ఏడు గంటలపాటు విద్యుత్‌ సరఫరా చేయాలంటూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిన్న విద్యుత్‌ సౌధ ముందు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.