నిరుద్యోగ యువకులకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది- టిఆర్ఎస్వి శంషాబాద్ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని శంషాబాద్ టిఆర్ఎస్వి అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగం సంపాదించుకున్న యువకులకు జాబ్ లెటర్ అందజేస్తున్న టిఆర్ఎస్వి శంషాబాద్ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అందరి సంక్షేమం కోరుకునే ప్రభుత్వమని, టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. ఈ జాబ్ మేళలో ఉద్యోగాలురని నిరుద్యోగ యువకులు ఎవరు నిరాశ పడకూడదని ఇలాంటి జాబ్ మేళాలు టిఆర్ఎస్ ప్రభుత్వం మరెన్నో నిర్వహించి నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తుందన్నారు.
ఫోటో రైటప్ : శంషాబాద్ లో నిర్మించిన జాబ్ మేళాలో జాబ్ లెటర్ అందజేస్తున్న టిఆర్ఎస్వి అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి.