నిర్మల్ జిల్లా తానూర్  పోలీస్‌ స్టేషన్‌ను 

భైంసా రూరల్ మార్చ్ 24 జనం సాక్షి భైంసా రూరల్ మార్చ్ 24 జనం సాక్షి
భైంసా  ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ తనిఖీ చేశారు. ముందుగా ఏఎస్పీ పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న అన్ని రికార్డులను, కేసు డైరీలను, రిజిస్టర్ లను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు.ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు.గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు,వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలన్నారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు