నూతనంగా ఎన్నికైన మను మయ సంఘ కార్యవర్గమును సన్మానించిన స్వర్ణకార సంఘం
మెట్పల్లి టౌన్, మార్చి 29,జనంసాక్షి :
\మెట్ పల్లి పట్టణ కేంద్రంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం కార్యవర్గం.. అధ్యక్షులు పులిమామిడి చంద్రయ్య
ను,ప్రధాన కార్యదర్శి శంభోజి శ్రీధర్ ను, కోశాధికారి సుతారి రాజశేఖర్ ను,గౌరవాధ్యక్షులు నూనె గోవర్ధన్ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ ,సహాయ కార్యదర్శి సుద్దాల హనుమాండ్లను, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ ఆర్గనైజర్ సెక్రెటరీ ఇల్లెందుల కృష్ణమాచారి, రాష్ట్ర స్వర్ణకార సంఘ ఆర్గానిక్ సెక్రెటరీ నాంపల్లి శ్రీనివాస్, ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఇల్లెందుల కృష్ణమాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ కుల వృత్తుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా పనిముట్లను అందించాలని, అలాగే విశ్వబ్రాహ్మణులకు పూర్తిస్థాయి సబ్సిడీతో కూడిన రుణాల మంజూరు చేసి వెంటనే ప్రకటించాలని నిరుపేద విశ్వ బ్రాహ్మణులకు పెన్షన్ లు మంజూరు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్, మరియు తెలంగాణ ఉద్యమ అమర వీరుడు శ్రీకాంత్ చారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని అన్నారు ,ఈ కార్యక్రమంలో ఇల్లెందుల కృష్ణమాచారి, నాంపల్లి పెద్ద శ్రీనివాస్ ,నాంపల్లి సింహాద్రి, శ్రీరామోజు ప్రవీణ్, ఇల్లెందుల వెంకటేష్ , తిప్పర్తి వెంకటేష్, హరీష్, ఇల్లందుల శ్రీనివాస్, మండలోజు మనోహర్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు