నెక్లెస్‌రోడ్డులో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌కు సర్కార్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో నెక్లెస్‌రోడ్డులో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రేపు మార్చ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెక్లెస్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించినట్లు సమాచారం.



