నెల్లూరురైల్వే ప్రమాదానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి:టీడీపీ

హైదరాబాద్‌: నెల్లూరురైల్వే ప్రమాదానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని టీడీపీ సీనియర్‌ నేత ఎర్రాన్నాయుడు అన్నాడు. షార్ట్‌ సర్కూట్‌వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతున్నప్పటికీ రైల్వేశాఖ గుణపాఠం నేర్చుకోకపోవటం దురదృష్ట కరమన్నారు. రాజకీయా ఒత్తిడితో రైల్వేశాఖ పనిచేస్తుందని విమర్శించారు. పాత బోగిలకు తాత్కాలిక మరమ్మత్తులు చేసి కొత్తరైళ్ల ప్రారంభిస్తుండటంవల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అత్యున్నత సాంకేతిక నిపుణులతో భద్రతపై కమిటీవేసి వారిచ్చే నివేదిక అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.