నెల్లూరు జిల్లాలో రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌ దాడులు

నెల్లూరు : జిల్లావ్యాప్తంగా రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేపట్టారు. కొవూరు మండలం ఇనుమడుగు రోడ్డులోని లక్ష్మిప్రసన్న రైన్‌మిల్లులో అధికారులు తనిఖీలు చేపట్టి ధాన్యం నిల్వలు వివరాలు సేకరించి అక్రమ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. రైస్‌ మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోనున్నట్లు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు.