నేచరాజుపల్లిలో రెండు రేషన్‌షాపుల సీజ్‌

నెల్లికుదురు: మండలంలోని నేచరాజుపల్లి గ్రామంలో రెండు రేషన్‌ దుకాణాలను రెవెన్యూ అధికారులు శనివారం సీజ్‌ చేశారు. ఎంఆర్‌ఐ బద్రూనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం గ్రామం నుంచి పీడీఎస్‌ బియ్యాన్ని డీలర్లు అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్థులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. అనంతరం అధికారులకు సమాచారాన్ని అందించటంతో గ్రామానికి వచ్చిన అధికారులు రేషన్‌ దుకాణాలను పరిశీలించి సీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.