నేటినుంచి అ¬రాత్ర మహాయజ్ఞం

గుంటూరు,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) : గుంటూరులో బుధవారం నుంచి 57వ శ్రీ షిరిడి సాయి అ¬రాత్ర మహాయజ్ఞం జరగనుంది. ఈ నెల 18 నుంచి 20 వరకు గురు రామ్‌ రతన్‌జీ ఆధ్వర్యంలో దీనిని చేపట్టారు. అరండల్‌పేటలోని పిచుకలగుంట మైదానంలో ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు విష్వక్సేనపూజ, పుణ్యహవాచన, రక్షాబంధన, అఖండ దీపారాధన, రుత్విక్‌  వరుణ దీక్షాధారణ, అష్టదిక్పాలక ఆరాధన, కలశారాధన, సాయి ప్రతిమాస్థాపన, సంధ్యాహారతి, అంకురార్పణ, నవగ్రహారాధన, విశేషార్చన, సకల దేవతా ప్రార్థన, చతుర్వేద పారాయణ, శేజ్‌హారతి, ప్రసాదవితరణ, 19న ఉదయం 4.30 గంటలకు విష్వక్సేనపూజ, పుణ్యహవాచన, అగ్నిమధన, అగ్ని ప్రతిష్ఠాపన, ఉదయం 6.30 గంటల నుంచి షిరిడిసాయి అ¬రాత్ర ¬మం జరుగనుంది. 20న విశ్వశాంతి ¬మం, పూర్ణాహుతి అనంతరం సిద్ధయోగి గురు రామ్‌ రతన్‌జీ సత్సంగం జరగనుంది.