నేటినుంచి మలక్‌పేట వద్ద అర్థరాత్రి ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్,అక్టోబర్30(జనంసాక్షి): మెట్రో రైలు పనుల నేపథ్యంలో మలక్‌పేట ఆర్‌వోబీ దగ్గర మంగళవారం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ మేరకు నగర ట్రాఫిక్ విభాగం సంయుక్త కమిషనర్ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌వోబీ పూర్తి కావడంతో అక్కడ ఉన్న నిర్మాణ సామగ్రి తొలగించనున్న దృష్ట్యా ఈ నెల 31 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. దాదాపు పదిరోజులపాటు అంటే నవంబరు 9 వరకు ప్రతిరోజూ రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5.30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆ సమయంలో ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను అనుమతించకుండా ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తారు. దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎంజీబీఎస్ వైపు వచ్చే భారీ వాహనాలను మూసారాంబాగ్ క్రాస్ రోడ్డు దగ్గర నుంచి గోల్నాక కొత్త వంతెన విూదుగా నింబోలిఅడ్డ, చాదర్‌ఘాట్ క్రాస్‌రోడ్డు విూదుగా మళ్లిస్తారు. సైదాబాద్ నుంచి చాదర్‌ఘాట్ వైపు వెళ్లే భారీ వాహనాలను చంచల్‌గూడ రోటరీ వద్ద మళ్లిస్తారు. అక్కడి నుంచి డబీర్‌పురా, ఏపీఏటీ, ఎస్‌జే రోటరీ విూదుగా చాదర్‌ఘాట్‌కు పంపిస్తారు. దిల్‌సుఖ్‌నగర్ వైపు నుంచి చాదర్‌ఘాట్ వైపు వెళ్లే ద్వి, త్రిచక్ర వాహనాలను మలక్‌పేట టి కూడలి వద్ద మళ్లించి లాలజర్ ¬టల్, కాలాడేరా, రైల్వే అండర్‌బ్రిడ్జి, అజీజియా మసీదు, చాదర్‌ఘాట్ రోటరీ విూదుగా పంపిస్తారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు సహకరించాలని కోరారు.



