నేటి నుంచి ఢిల్లీలో కిషన్‌రెడ్డి మూడు రోజుల దీక్ష

న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీ కేంద్రంగా యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పేంచేందుకు భాజపా సిద్ధమైంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ పోరు దీక్ష ( సత్యాగ్రహ దీక్ష) చేపట్టనుంది. ప్రత్యేక్ష రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఉదయం 11.30 గంటలకు భాజపా అగ్ర నేత సుష్మాస్వరాజ్‌ ప్రారంభిస్తారు. భాజపా, ఎన్టీయే ముఖ్యనేతలతో పాటు తెలంగాణ రాజకీయ ఐకాస నాయకులు కూడా హాజరు కానున్నారు.