నేటి నుండి పవిత్రోత్సవాలు

విజయవాడ, జూలై 31 : కనకదుర్గమ్మ ఆలయంలో బుధవారం నుండి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ప్రతి శ్రావణమాసంలో ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం పరిపాటి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేయడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం చండీహోమంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని, శుక్రవారం సాయంత్రం ముగుస్తాయని ఆలయ కార్యనిర్వహణాధికారి రఘునాథ్‌ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీసులు పొందాలని ఇఓ కోరారు.