ఎసఎల్‌బీసీ జాప్యం వద్దు
` త్వరితగతిన పూర్తి చేయండి
` నిర్మాణంలో ఎలాంటి అలసత్వాన్ని ఉపేక్షించం
` నిరంతరం పనుల సమీక్షపై రూట్ మ్యాప్
` భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దష్టి
` ప్రభుత్వం చేతికి హెలి`బోర్న్ సర్వే నివేదిక
` ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్.ఎల్.బి.సి నిర్మాణంపనులలో జాప్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.సొరంగం మార్గం పనులను నిరంతరం కొనసాగించి త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.సొరంగ నిర్మాణ పనులలో ప్రమాదాలు పునరావతం కాకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం భద్రతా చర్యలపై ప్రత్యేక దష్టి సారించిందని ఆయన వివరించారు.అర్దాంతరంగా నిలిచి పోయిన ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణ కై చేపట్టిన హెలి`బోర్న్ సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరిందని ఆయన చెప్పారు.శ్రీశైలం ఎడమగట్టు కాలువతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పధకంలో అంతర్భాగమైన మెడిగడ్డ, సుందిళ్ళ,అన్నారం బ్యారేజ్ ల పునరుద్ధరణ పనులపై ఆయన ఆదివారం సాయంత్రం నీటిపారుదల శాఖాధికారులతో ప్రత్యేక సవిÖక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గం మిగిలిన భాగం పూర్తి చేయడానికి అవసరమైన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో నిర్వహించిన ఏరియల్ ఎలాక్టో మాగ్నెటిక్ సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరిందని ఆయన తెలిపారు.సొరంగమార్గం పూర్తికి సర్వే ఆధారంగా రూపొందించిన నివేదిక దోహద పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.భౌగోళికంగా ప్రతికూల పరిస్థితిలు ఏర్పడితే ముందస్తుగా బందోబస్తు చర్యలు చేపట్టదానికి ఈ సర్వే ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.సొరంగమార్గం పూర్తి చేయడానికి గాను ఆధునిక పరిజ్ఞానం వినియోగించడంతో పాటు శాస్తీయ పద్దతిలో నిరంతరం అధికారుల పర్యవేక్షణలో పనులు కొనసాగేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.ప్రాజెక్టు నిర్వహణకై ప్రత్యేకంగా డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు ఆపరేషన్ బందానికి ప్రత్యేక చీఫ్ ఇంజనీర్ ను నియమించాలని ఆయన అధికారులను ఆదేశించారు.నిర్మాణం జరుగుతున్న సమయంలో ఎప్పటికప్పుడు భద్రతా,నాణ్యత ప్రమాణాలను పాటించేలా చూడడంతో పాటు అధికారులు రూపొందించిన డిజైన్ ప్రకారం నిర్మాణం కొనసాగేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన చీఫ్ ఇంజినీర్ కు సహకరించేలా ఉండేందుకు స్వతంత్ర పర్యవేక్షణ కన్సల్టెంట్ ను నియమించాలని ఆయన సూచించారు.నిరంతరం పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు గాను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ క్షేత్ర స్థాయిలో భాగస్వామ్యులు అవుతారని ఆయన చెప్పారు.అదే సమయంలో సొరంగ మార్గంలో ఏర్పదుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు గాను ప్రత్యేక జియో టెక్నీకల్,జియాలజికల్ బందాలను ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు.దీనితో పాటు కాళేశ్వరం బ్యారేజ్ ల పనుల పునరుద్ధరణ పనులు వేగవంతంచేయడానికి అవసరమైన సాంకేతిక సంస్థలను,డిజైన్ కన్సల్టెంట్స్ సమన్వ్యయం ఆవశ్యకత గురుంచి ఆయన వివరించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిర్వహించే పరీక్షల షెడ్యూల్ ,ప్రాజెక్ట డిజైనర్ల పనితో సమన్వయం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.పరస్పరం సమన్వయం చేసుకుంటూ పోతే కేంద్ర జల వనరుల సంఘం పరిధిలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుండి డిజైన్ లకు దశలవారిగా అనుమతులు పొందడం సులభతరమౌతుందని ఆయన చెప్పారు .ఈ మేరకు ఫిబ్రవరి 16 తరువాత ఎన్.డి.ఎస్.ఏ నిపుణుల కమిటీ తో సమావేశం నిర్వహించాలని అధికారులకు సూచించారు.పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన అనుమతులు పొంది పనులు వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.



