తప్పు చేస్తే విచారించొద్ద్దా?
` కేసీఆర్ చట్టానికి అతీతుడా?
` టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్(జనంసాక్షి):మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు సంబంధించిన సిట్ విచారణ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులు తప్పకుండా ఈ అంశంపై స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. కేసిఆర్ పాలనలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, ప్రజాధన దుర్వినియోగంపై సిట్ విచారణ జరుగుతుండటం ప్రజాస్వామ్యానికి, చట్టపాలనకు అనుకూలమని ఆయన పేర్కొన్నారు.I కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చట్టం ముందు అందరూ సమానమే అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉందని, నిజాలు బయటపడాలన్నదే తమ లక్ష్యమని మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. సిట్ విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు, రాజకీయ ఒత్తిళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.I ప్రజల్లో గందరగోళం సష్టించేందుకు జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని డిసిసి అధ్యక్షులు ఖండించాలని, కాంగ్రెస్ పార్టీ వైఖరిని బలంగా ప్రజల ముందుంచాలని ఆయన సూచించారు.I రాష్ట్ర ప్రజలు సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారని, అందుకు ఈ విచారణ కీలకమని టీపీసీసీ అధ్యక్షులు అన్నారు.



