నేటి రాత్రి నుంచి సమ్మెకు దిగనున్న 108 ఉద్యోగులు

హైదరాబాద్: అందరినీ ఆదుకునే తమనెవరు ఆదుకుంటారని 108 ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు రాత్రి నుంచి 108 ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. సమ్మె నోటీసు ముందే ఇచ్చినా.. యాజమాన్యం తెలివిగా రేపు సాయంత్రం 4 గంటలకు చర్చలకు రావాలని పిలిచింది. చర్చలకు రాకుండా సమ్మెకు దిగితే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. వారు చేస్తున్న 11 డిమాండ్లలో 9 డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని జీవీకే యాజమాన్యం చెబుతోంది.