నేడు ఆజాద్‌, షిండేలతో తెలంగాణ జేఏసీ భేటీ

ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం సబీ ఆజాద్‌ను తెలంగాణ జేఏసీ నేతలు మధ్యాహ్నం కలువనున్నారు. తెలంగాణ మార్చ్‌ పర్యవసానాలను వివరించి, ఆలోపే తెలంగాణపై నిర్ణయం  తీసుకోవాలని, లేనిపక్షంలొ జరుగబోయే పరిణామాలకు కాంగ్రెస్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేయనున్నారు. ఆ తర్వాత హోం మంత్రి షిండేను కలిసి సెప్టెంబర్‌ 30 మార్చ్‌కు అనుమాతించాలని, ఆలోపే తెలంగాణపై తేల్చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేయనున్నారు.