నేడు కర్నూలు జిల్లాలో సీఎం రెండో రోజు పర్యటన

కర్నూలు: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండో రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం  కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో వ్యవసాయ గోదాములను సీఎం అందుబాటులోకి  తేనున్నారు. 10 గంటలకు ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌ స్టేడియంలో గురువూజోత్సవరంలో పాల్గొంటారు. 11 గంటలకు కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ వద్ద పుట్‌ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించి జిల్లా అభివృద్ధి, సంక్షేమ  కార్యాక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో భేటా కానున్నారు. ప్రతికూల వాతావరణంతో వాయిదా పడిన తొలిరోజు పర్యటన రేపు కొనసాగనుంది.