నేడు గవర్నర్‌ నరసింహన్‌తో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఈ రోజు గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఈ నెల 30 తలపెట్టిన  తెలంగాణ మార్చ్‌కు అనుమతివ్వాలని వారు గవర్నర్‌ను కోరనున్నారు.