నేడు తుది ఓటర్ల జాబితా ప్రకటన 

హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారందరినీ కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునే కార్యక్రమం ముగిసింది. మార్పులు, చేర్పులు పూర్తయ్యాయనీ, ఓటర్ల జాబితాలను ఈ నెల 22న ప్రచురిస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఓటర్ల తుది జాబితా విడుదల కానున్న సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయా జిల్లాలో అభిప్రాయ సేకరణ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా, అధికారుల పనితీరుపై ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్నారు. పలుచోట్ల జిల్లావ్యాప్తంగా ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయనీ, ఓటరు కార్డుకు ఆధార్‌ నెంబర్‌ అనుసంధానం చేయాలనీ కోరారు. అలాగే  ఓటర్ల పోలింగ్‌ కేంద్రాలు మారాయనీ, బీఎల్వోల పనితీరు సరిగా లేదనీ, ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేయలేదని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఇక ముందైనా ఓటర్ల జాబితాలను పకడ్బందీగా తయారు చేసి, తమకు అందించాలని కోరారు. వివిధ జిల్లాల్లో సమాలోచలన తరవాత పార్టీల వారీగా అందరి అభిప్రాయాలను ఎన్నికల సంఘానికి నివేదిస్తామరు. ఇప్పటి వరకు గల్లంతైన ఓటర్లను వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోగా, జాబితాల్లో మళ్లీ పొందుపరిచామని తెలిపారు. మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న ఓటర్లందరి వివరాలు సరి చేశామని పేర్కొన్నారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఉన్న ఓటర్లను అదే పోలింగ్‌ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని చెప్పారు.