నేడు తెరాస శాసనసభాపక్షం భేటీ

హైదరాబాద్‌: తెరాస శాసనసభాపక్షం నేడు భేటీ కానుంది. రేపటి నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చంచనున్నారు. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ సమావేశాలను అడ్డుకోవాలని నేతలు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.