నేడు పోతంగల్లో మేకల సంత,వీక్లీ మార్కెట్,డైలీ మార్కెట్ వేలం పాట.

కోటగిరి మార్చి 17 జనం సాక్షి:-పోతంగల్ మండల కేంద్రానికి చెందిన మేకల సంత,వీక్లీ మార్కెట్,డైలీ మార్కెట్ వేలం పాట శనివారం నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి డబ్ల్యు.యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు వేలంపాటలో పాల్గొనేవారు రూ.50,000 తో మేకల సంత,వీక్లీ మార్కెట్ అలాగే రూ.20,000 తో డేలీ మార్కెట్ లకు డిపాజిట్ చేసి వేలం పాట పాడాలని ఆయన అన్నారు.ఈ వేలం పాటలు దక్కించుకున్న వారు 25% మొత్తాన్ని అప్పటికప్పుడే చెల్లించాలన్నారు. మిగతా మొత్తాన్ని 2024 ఏప్రిల్ 1 తేదీలోపు చెల్లించాల్సి వుంటుంద న్నారు