నేడు ప్రారంభం కానున్న నాలుగు క్రొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

హైదరాబాద్‌ : నాలుగు క్రొత్త రైళ్లు ఈ రోజు పట్టాలెక్కనున్నాయి. హైదరాబాద్‌ నుంచి పలు ప్రాంతలకు నడిచే ఈ రైళ్లును సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి మునియప్ప ప్రారంభిస్తారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ ప్రాంగణంలో 10వ నంబర్‌ ప్లాట్‌ ఫారంపై ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ఏర్పటు చేశారు. సికింద్రాబాద్‌-విశాఖల మధ్య నడిచే ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌- దర్బంగాల మధ్య నడిచే బైైవీక్లీ దర్బంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మునియప్ప సమక్షంలో ప్రారంభిస్తారు.అనంతరం నాంపెల్లి నుంచి బయలు దేరే హైదరాబాద్‌-బెల్లంపెల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌-అజ్మీరా వీక్లి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా ప్రత్యేకంగా ఏర్పటు చేసిన విడియో లింక్‌ ద్వారా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి దక్షిణమధ్య రైల్వే అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

తాజావార్తలు