నేడు భేటీ కానున్న మంత్రిమండలి
హైదరబాద్,నవంబర్22: మూడు నెలల సుదీర్ఘ విరామం తరవాత రాష్ట్ర మంత్రివర్గ సమావేశ జరగబోతోంది. వుక్రవారం సాయత్రం నాలుగంటలకు మంత్రివర్గ భేటీ జరగనుంది. దాదాపు 3నెలలు తర్వాత రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఇప్పటివరకు కనీసం రెండు నెలలకొకసారైనా మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తూ వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి తాజా బేటీకి మరింత వ్యవధి తీసుకోవడం గమనార్హం.వివిధ సమస్యలు, నీలం తుఫాన్ నష్టం, గ్యాస్ భారం,తాజా రాజకీయాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఉంది. అలాగే పలు అంశాలను చర్చించే అవకాశం ఉంది.



