నేడు మంత్రుల కమిటీ సమావేశం

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి విశ్లేషణ. భవిష్యత్‌ కార్యాచరణ నిమిత్తం ఏర్పాటైన 10మంది మంత్రుల కమిటీ ఈరోజు మరోమారు సమావేశం కానుంది. ఈ సమావేశం ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి నివాసంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం నాటి సమావేశంలో పార్టీ, ప్రభుత్వ బలాలు-బలహీనతలకు సంబంధించి 45 అంశాలను గుర్తించిన అమాత్యులు ఈ భేటీకి కొన్ని అంశాలు ఎంచుకున్నారు. ప్రభుత్వ కార్యకలాపాల అమలు, సంక్షేమ పథకాలను పార్టీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం, శ్రేణుల మధ్య సమన్వయం తదితర అంశాలు ఇందులో ఉన్నట్లు సమాచారం.