నేడు రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్‌ పదవీవిరమణ

న్యూఢిల్లీ: భారత రిపబ్లిక్‌కు  12వ రాష్ట్రపతిగా తన సేవలందించిన శ్రీమతి ప్రతిభాపాటిల్‌ ఈ రోజు పదవీవిరమణ చేయనున్నారు. ఈ మేరకు ఆమె ఈ రోజు జాతినుద్ధేశించి ప్రసంగిస్తారు. నిన్న ఆమెకు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో వీడ్కోలు సభ నిర్వహించి, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రసంగిస్తూ దేశానికి పాటిల్‌ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి యూపీఏ అధినేత సోనియాగాంధీ,ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఇంకా పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.