నేడు రాష్ట్ర కేబినెట్‌ సమావేశం

హైదరాబాద్‌: ఈరోజు రాష్ట్ర కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నివేదికకు ఈ సమావేశంలో మంత్రివర్గ ఆమోదం తెలపనుంది. ఈ నెల 30, డిసెంబర్‌ 1న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. డిసెంబర్‌ రెండోవారంలో శీతాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.