నేడు శ్రీపాండురంగస్వామి కళ్యాణం

ఒంగోలు, మార్కాపురంటౌన్‌ ,జూన్‌ 30 : శ్రీ పాండురంగస్వామి, రుక్మాబాయిల కళ్యాణ మహోత్సవం నేడు ఉదయం 11 గంటలకు విశాఖ నక్షత్రయుక్త కళ్యాణ లగ్న పుష్కరాంశమందు వైభవంగా జరుగునని దేవస్థానం కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి వెంకటసత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కళ్యాణమహోత్సవ కార్యక్రమాలు నేటి నుండి జులై 4వ తేదీ వరకు నిర్వహించబడునని ఇందులో భాగంగా శాంతి హోమం, పూర్ణాహుతి, తీర్ధప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహించబడునని నిర్వాహకులు తెలిపారు. కావున భక్తాదులు విరివిగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్దప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహక కమిటీ తెలిపింది.