నేడు సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట

మెదక్‌, నవంబర్‌ 15 : ఈ నెల 16వ తేదీన మాతా బోరంచమ్మ దేవాలయ ప్రాంగణంలో సరస్వతి దేవి విగ్రహా ప్రతిష్ట జరుగుతుందని నిర్వాహకులు గడ్డం కృష్ణమూర్తి, ఈరంటి నారాయణ, అబ్రబోయిన నారాయణలు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో అన్ని దేవాతా మూర్తులు ఉండాలన్న సంకల్పంతో మాతా బోరంచమ్మ దేవాలయ ప్రాంగణంలో ఇప్పటి వరకు పంచముఖ ఆంజనేయస్వామి, నాగదేవతా, నవగ్రహాలు స్థాపించడం జరిగిందన్నారు. పట్టణంలో సరస్వతీ దేవి ఆలయం లేకపోవడంతో భక్తుల కోసం సరస్వతీ ఆలయాన్ని నిర్మించామని తెలిపారు. శుక్రవారంనాడు అమ్మవారి విగ్రహాప్రతిష్టాపన జరుగుతుందన్నారు. గురువారంనాడు గణపతిపూజ, పుణ్య హావచనంతో పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించి మాతా విగ్రహాన్ని పట్టణంలో ఊరేగింపు కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులతో వీదులలో  నడుచుకుంటూ వెళ్ళి, భక్తి గీతాలాపన చేస్తుండగా తిరిగి దేవాలయం చేరుకుంది. శుక్రవారం ఉదయం నుండి దేవతా పూజా, ఉత్సవకార్యక్రమాలు 11.40 గంటలకు అమ్మవారి విగ్రహా ప్రతిష్టాపన జరుగుతుందని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం, రాత్రి భజన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. వేద బ్రహ్మాణులు శాస్త్రులు కృష్ణమూర్తి, భగవతం హరిప్రసాద్‌శర్మ, వైద్యశ్రీనివాస్‌ శర్మ, మిట్టపల్లి ప్రసాద్‌ శర్మల ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పెర్కోన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ, ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.