నేడు సీఎన్‌కు నోటీసు ఇవ్వనున్న ఎపీఎన్జీవోలు
హైదరాబాద్: తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఎపీఎన్జీవో సంఘం ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీను ఇవ్వనుంది. పదో వేతన సవరణ సంఘం ఏర్పాటుతో పాటు ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ నియామకాల రద్దు, శాశ్వత ఉద్యోగుల నియామకం, అందరికీ ఆరోగ్య కార్డుల మంజూరు వంటివి ప్రధాన డిమాండ్లు నోటీసులో పొందుపరిచినట్లు సమాచారం. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 13న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎపీఎన్జీవో సంఘం నిర్ణయించింది.