నేడే జేఈఈ మెయిన్స్
హైదరాబాద్: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ ఎంట్రెన్స్ లో భాగంగా మెయిన్స్ పరీక్ష నేడు జరగనుంది. దేశ వ్యాప్తంగా 9,30 గంటలకు ప్రారంభం అయి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేరర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. హైదరాబాద్ లో ఈ పరీక్షకు హాజరు కానున్న 50 వేల మంది విద్యార్థుల కోసం 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.