నేర్చుకున్న విద్యను కొనసాగించాలి. సంఘ సేవకులు కే.రమేష్
కోటగిరి మార్చి 10 జనం సాక్షి:-నేర్చుకున్న విద్యను కొనసాగించి కుటుంబ ఆదాయానికి దోహదపడాలని అభయ అసోసియేషన్ సహాయకులు కే.రమేష్ పేర్కొన్నారు.కోటగిరి మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవన్లో గత నెల రోజులుగా అభయ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఉషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంబ్రాయిడింగ్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్ర మం శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవస్థాపక నిర్వకులు శిక్షణ ముగించిన 30 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.ఈ సందర్భం గా అభయ అసోసియేషన్ సహాయకులు కే.రమేష్ కి శిక్షణ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ ముగింపు కార్యక్రమంలో ట్రైనర్ నాగరాణి,శిక్షణ విద్యార్థులు ఉన్నారు.