నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ కార్యాలయం రైతులు ముట్టడి

గుంటూరు: గుంటూరులోని నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. బీమా అధికారులు, గుంటూరు పశ్చిమ మండల డీఎస్పీ రైతు ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. నష్టపరిహారంపై లిఖితపూర్వక హామి ఇవ్వాలని రైతులు ఇన్సూరెన్స్‌ కంపెనీకి స్పష్టం చేశారు.