నైతిక విలువలతో విద్యను అందించాలి : చంద్రబాబు

హైదరాబాద్‌: విద్యా సంస్థల వల్ల ప్రజలకు నైతిక విలువలతో కూడిన విద్య అందడంలేదని తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. అక్రమంగా ఆస్తులు సంపాదించిన వారినే హీరోలుగా కీర్తించే పరిస్థితి నేటి సమాజంలో నెలకొందన్నారు. ఇది బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం శనివారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించింది. ముఖ్య అతిధిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యంమిచ్చామన్నారు.