నోట్ల రద్దు, జీఎస్టీతో అన్ని రంగాలు కుదేలయ్యాయి: సీతారాంఏచూరి
హైదరాబాద్ : ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ మతోన్మాదాన్ని ముందుకు తెచ్చారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. మోదీ పాలనలో మైనారిటీలపై దాడులు పెరిగిపోయాని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో సీపీఎం 22 జాతీయ మహాభసలు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. దీనిలో భాగంగా జరిగిన ఆహ్వాన సంఘం సన్నాహక కమిటీ సమావేశానికి ఏచూరి హాజరయ్యారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని సీతారాం ఏచూరి చెప్పారు.




