న్యాయస్థానాన్నీ తప్పుదోవ పట్టించారు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: జగన్‌ మీడియా సంస్థలు న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించాయని, సీబీఐ సీజ్‌ చేసిన  ఖాతాలను కాకుండా వేరే ఖాతాలను జగన్‌ సంస్థలు నిర్వహిస్తున్నాయని తెలుగుదేశం నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తప్పుడు సమాచారం కారణంగానే జగన్‌ సంస్థలకు హైకోర్టు జరిమానా విధించిందన్నారు. అధికారం కోసం విజయమ్మ ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని. శాసనవ్యవస్థ, ప్రభుత్వ శాఖలను వైఎస్‌ నిర్వీర్యం చేశారని రేవంత్‌ రెడ్డి అన్నారు.